ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

Road-Accidentనవతెలంగాణ – అమరావతి : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం బార్లపల్లె వద్ద బెంగళూరు జాతీయ రహదారిపై ఎదురుగా వచ్చిన కారును లారీ ఢీకొట్టగా ఐదుగురు చనిపోయారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గాయపడ్డ మరికొందరిని సమీప ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు.

Spread the love