ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

నవతెలంగాణ – అమరావతి: బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోని లారీ బలంగా ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఏకంగా ఐదుగురు మృతి చెందారు. ఆదివారం తెల్లవారుజామున ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఘటనా స్థలంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఇద్దరు మహిళలు, ఒక వ్యక్తి ఉన్నారు. ఇక చికిత్స పొందుతూ మరో ఇద్దరు కన్నుమూశారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. కాగా మృతులు నరసరావుపేటకి చెందిన డాన్స్ పార్టీ గ్రూప్‌గా గుర్తించారు. వినుకొండ నుండి నరసరావుపేట వెళ్తుండగా ఈ దర్ఘటన చోటుచేసుకుంది.

Spread the love