పిల్లిని కాపాడబోయి ఐదుగురు మృతి

నవతెలంగాణ – హైదరాబాద్: పాడుబడిన బావిలో పడిన  పిల్లిని రక్షించడానికి  ఓ కుటుంబంలలోని ఐదుగురు బావిలోకి దూకి మరణించారు. ఈ విషాదకరమైన ఘటన మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో  చోటుచేసుకుంది. ముందు బావిలో పడిన పిల్లిని రక్షించడానికి ఒక వ్యక్తి బావిలో దూకగా.. ఆ తరువాత ఒకరు తరువాత మరోకరు బావిలోకి దూకారు.  మొత్తం ఆరుగురు బావిలో దూకగా…  చివరగా తాడు కట్టుకుని దూకిన వ్యక్తిని కాపాడినట్లుగా పోలీసులు తెలిపారు. అతనిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా  చికిత్స పొందుతున్నాడు.  అయితే ఆ బావిని బయో గ్యాస్ కు ఉపయోగిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.  ఊపిరాడకనే వీరంతా చనిపోయినట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు.  ఐదుగురి మృతదేహాలను రెస్క్యూ టీమ్ స్వాధీనం చేసుకుంది.

Spread the love