ఘోర రోడ్డు ప్రమాదం… ఐదుగురు సజీవదహనం

నవతెలంగాణ-భూపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ధార్లో సోమవారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఓ లారీ బీభత్సం సృష్టించిన ఈఘటనలో మూడు ట్రక్కులు, ఒక కారును అదుపుతప్పి ఢీకొట్టింది. కారుతో పాటు మూడు ట్రక్కుల్లో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో ఐదుగురు సజీవదహనం అయ్యారని తెలుస్తోంది. ఆగ్రా – బొంబాయి జాతీయ రహదారి నంబర్ 3లోని గణపతి ఘాట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Spread the love