నవతెలంగాణ – ముంబయి: మహారాష్ర్టలోని భండారా జిల్లాలో ఓ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందినట్లు తెలుస్తోంది. ఉదయం 10.30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు జిల్లా కలెక్టర్ సంజయ్ కోల్తే వెల్లడించారు. పేలుడు తీవ్రతకు ఫ్యాక్టరీ పైకప్పు కూలిపోయింది. ఈ శబ్దం 5 కిలోమీటర్ల వరకు వినిపించినట్లు స్థానిక ప్రజలు చెబుతున్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో దట్టమైన పొగ కమ్ముకుంది. ప్రమాదం సమయంలో ఫ్యాక్టరీలో 12 మంది ఉన్నారు. వీరిలో ఇద్దరిని కాపాడినట్లు సమాచారం. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.