‘గృహలక్ష్మి’లో వికలాంగులకు ఐదు శాతమివ్వాలి

– మంత్రి వేములకు రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్‌ చైర్మెన్‌ డాక్టర్‌ కె.వాసుదేవరెడ్డి వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గృహలక్ష్మి పథకంలో వికలాంగులకు ఐదు శాతం కోటా కేటాయించాలని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్‌ చైర్మెన్‌ డాక్టర్‌ కె.వాసుదేవరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సము దాయంలో మంత్రి ప్రశాంత్‌ రెడ్డికి ఆయన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వాసుదేవరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల సమాజానికి ఎంతో కృషిచేసిందని కొనియాడారు. దేశంలోనే వికలాంగులకు అత్యధికంగా పింఛన్‌ ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. రాష్ట్రంలో దాదాపు 10 లక్షల మంది వికలాంగులున్నారనీ, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అన్ని సంక్షేమ పథకాల్లో కూడా వికలాంగులకు రిజర్వేషన్‌ అవకాశాలను కల్పిస్తుందని చెప్పారు. గృహలక్ష్మి పథకంలోనూ ఐదు శాతం కోటా కేటాయించాలని కోరారు.

Spread the love