– ఎంపీ, ఎమ్మెల్యే ఫొటో పెట్టలేదని బీజేపీ నాయకుల వాగ్వాదం
నవతెలంగాణ-ఆర్మూర్
నిజామాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటనలో రచ్చరచ్చ జరిగింది. ప్రొటోకాల్ ప్రకారం ఫ్లెక్సీలో బీజేపీ ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి ఫొటోలు పెట్టలేదని బీజేపీ నాయకులు వాగ్వాదానికి దిగగా.. బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఆర్మూర్ పరిధిలోని పెర్కిట్ ధాన్యం కొనుగోలు కేంద్రానికి మంత్రి వచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో పొటోలు లేకపోవడంతో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో ఫ్లెక్సీలను చించేశారు. ఏసీబీ వెంకటేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను, నాయకులను సముదాయించడంతో గొడవ సద్దుమణిగింది.