రాజమండ్రిలో విమాన సర్వీసులు రద్దు

నవతెలంగాణ – రాజమండ్రి: రాష్ట్రంలో మిచాంగ్ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. తుఫాను ప్రభావంతో పలు జిల్లాలో ఎడతెరపిలేకుండా వర్షాలు కురిస్తున్నారు. తుఫాను నేపథ్యంలో అనేక విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. రాజమండ్రి విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు తాత్కాలికంగా రద్దు అయ్యింది. రాజమండ్రి విమానాశ్రయం నుంచి వివిధ రాష్ట్రాలకు వెళ్లే తొమ్మిది విమాన సర్వీసులను అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు. మరోవైపు తుఫాన్ కారణంగా తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో భారీగా వర్షం కురుస్తోంది. దీంతో విద్యాశాఖ అధికారులు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయకపోవటం వల్ల కళ్ళాల్లోనే ధాన్యం రాశులు ఉండిపోయాయి.

Spread the love