ఫ్లైఓవర్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి..

నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి మండలంలోని బర్దిపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని నిజాంబాద్ డిచ్పల్లి మధ్యలో ఉన్న మాధవ నగర్ అర్ బిఓ పనులను మంగళవారం మాజీ కేంద్ర మంత్రి రాజ్యసభ సభ్యుడు ప్రకాష్ జవదేకర్, ఎంపీ ధర్మపురి అర్వింద్ తదితరులతో కలిసి నిర్మాణ పనులను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఫ్లై ఓవర్ బ్రిడ్జి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయితే జిల్లా కేంద్రానికి రాకపోకలు సాగించే వారికి ఎంత సౌకర్యవంతంగా ఉంటుందని ఇదే కాకుండా నిజామాబాద్ రూరల్ ,నగర ప్రజల ఆకాంక్ష కుడా ఎన్నో ఏండ్లుగా ఉందని నాయకులు మాజీ మంత్రికి వివరించారు. ఆయన వెంట రైల్వే అధికారులు, జిల్లా, రూరల్ ఇంచార్జీ దినేష్ కూమార్, నాయకులు తదితరులు ఉన్నారు.

Spread the love