నూతన ఓటర్ల నమోదుపై దృష్టి సారించండి

నవతెలంగాణ – హైదరాబాద్‌: రాష్ట్రంలో నూతన ఓటర్ల నమోదుపై అధికారులు ప్రత్యేకంగా దష్టి సారించాలని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌ సూచించారు. అన్ని జిల్లాల అధికారులతో ఆయన శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. మహిళలు, వికలాంగులు, 60ఏళ్లు దాటిన వారు, థర్ట్‌ జెండర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రోత్సాహించాలని సూచించారు.

Spread the love