దులీప్ ట్రోఫీకి సౌత్ జోన్ జట్టు
బెంగళూర్ : భారత టెస్టు జట్టు విదేశీ పర్యటనల్లో కచ్చితంగా చోటు సాధించే ఆటగాడు హనుమ విహారి. విదేశీ గడ్డపై మంచి రికార్డున్న హనుమ విహారి ఇటీవల ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ జట్టుకు ఎంపిక కాలేదు. భారత జట్టు జులైలో కరీబియన్ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో టెస్టు జట్టులోకి పునరాగమనం చేసేందుకు హనుమ విహారి ఎదురు చూస్తున్నాడు. ఇదే సమయంలో టెస్టులతో పాటు వన్డే, టీ20 జట్టులో చోటుపై కన్నేసిన యువ క్రికెటర్ తిలక్ వర్మ దులీప్ ట్రోఫీలో సెలక్టర్లను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాడు. బెంగళూర్‌లో జరుగనున్న దులీప్ ట్రోఫీకి సౌత్ జోన్ జట్టును ఎంపిక చేశారు. హనుమ విహారి కెప్టెన్సీ వహించనుండగా.. మయాంక్ అగర్వాల్ వైస్ కెప్టెన్‌గా ఉండనున్నాడు. దులీప్ ట్రోఫీ ఫైనల్ జులై 12 నుంచి చిన్నస్వామి స్టేడియంలో జరుగనుంది.
సౌత్ జోన్ జట్టు : హనుమ విహారి (కెప్టెన్), మయాంక్ అగర్వాల్ (వైస్ కెప్టెన్), బి. సాయి సుదర్శన్, రికీ భురు (వికెట్ కీపర్), కె.ఎస్ భరత్ (వికెట్ కీపర్), ఆర్ సమరత్, వాషింగ్టన్ సుందర్, సచిన్ బేబి, రంజన్ పాల్, సాయి కిశోర్, కావేరప్ప, విజరుకుమార్ వైశాక్, కెవి శశికాంత్, దర్శన్ మిశాల్, తిలక్ వర్మ.