పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయంలో శనివారం అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించినారు. పట్టణానికి చెందిన గుండాజీ యోషిక జన్మదినాన్ని పురస్కరించుకుని 150 మంది భక్తులకు అన్నదానం చేసినారు. ఈ సేవా కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు స్థానిక ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు. భక్తుల సేవకు అంకితమైన ఈ కార్యక్రమం పలువురి ప్రశంసలు పొందింది. భవిష్యత్తులో ఇటువంటి మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నదాతలు తెలిపారు .ఈ కార్యక్రమంలో ఎల్ఐసి అడ్వైజర్ గుండాజి సాయన్న, హేమలత, సంపత్ ,సౌమ్య, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.