భువనగిరి మండలం చీమల కొండూరు పరిధిలో ఉన్న శ్రీ సాయి వృద్ధ ఆశ్రమంలో వృద్ధులకు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భువనగిరి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చిక్కుల వెంకటేశం, మండల పార్టీ అధ్యక్షులు ఎలిమినేటి కృష్ణారెడ్డిలు మాట్లాడుతూ.. భువనగిరి శాసనసభ్యులు కుంభ అనిల్ కుమార్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ప్రతి గ్రామంలో నిర్వహించాలని, వారి సేవలు ఈ నియోజకవర్గంలో చాలా అవసరం అని బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని వారు పేద ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటారని అన్నారు. వారు ఆయురారోగ్యాలతో భగవంతుని ఆశీస్సులతో చల్లగా ఉండాలని ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు సర్పంచులు జీలుగు కవిత సతీష్ పవన్, ఎల్లంల శాలిని జంగయ్య, నానం పద్మ కృష్ణ, తంగళ్ళపల్లి కల్పన శ్రీనివాస చారీ, మట్ట శంకర్ బాబు,మాజీ ఎంపీపీ తోటకూరి వెంకటేశ్ యాదవ్, నుచ్చు నాగయ్య, ఎడ్ల శ్రీనివాస్, పిట్టల రజిత, బింగి బిక్షపతి, ఓరుగంటి ఆంజనేయులు, చిన్నం శ్రీనివాస్, మంగ ప్రవీణ్, మచ్చ పాండు, చుక్క స్వామి, సాల్వే ఉపేందర్, దయ్యాల శ్రీశైలం పిట్టల వెంకటేశం గిరీష్ లు పాల్గొన్నారు.