నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండల పరిధిలోని వాడాయి గూడెం గ్రామంలో సురేంద్రపురి లోని పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో దేవాలయ చైర్మన్ కొండ ప్రతిభ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతిని సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముందు హనుమాన్ జయంతి సందర్భంగా పురస్కరించుకొని భగవాన్ హనుమాన్ సువర్చల ల కళ్యాణ మహోత్సవము భక్తజనుల సమక్షంలో కనుల పండుగగా వేద బ్రాహ్మణులచే నిర్వహించారు. తదనంతరం ఆలయం తరఫున అన్నదాన కార్యక్రమాన్ని కుందా ప్రతిభ కుటుంబ సభ్యులు ప్రారంభించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.