
మండల కేంద్రానికి చెందిన చింతకుంట రవి అగ్నివీర్ గా ఎంపికైనందుకు హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ తరపున ఘనంగా సన్మానించారు. ఈ మేరకు మంగళవారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి ఆధ్వర్యంలో అగ్నివీర్ గా ఎంపికైన చింతకుంట రవిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రవిని శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామానికి చెందిన వ్యక్తి అగ్నివీర్ గా ఎంపిక ఇవ్వడం గ్రామస్తులందరికీ గర్వ కారణమని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న, నాయకులు నూకల బుచ్చి మల్లయ్య, నిమ్మ రాజేంద్రప్రసాద్, పాలెపు చిన్న గంగారం, సింగిరెడ్డి శేఖర్, పూజారి శేఖర్, సుంకేట శ్రీనివాస్, వేములవాడ జగదీష్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.