స్వయంభూ కోసం..

స్వయంభూ కోసం..హీరో నిఖిల్‌ నటిస్తున్న తన 20వ చిత్రం ‘స్వయంభూ’. ఇందులో యోధుడి పాత్రను పోషించడానికి ఆయుధాలు, మార్షల్‌ ఆర్ట్స్‌ , గుర్రపు స్వారీలో ట్రైనింగ్‌ తీసుకున్నాడు. అద్భుతమైన వార్‌ సీక్వెన్సులు ఉండే ఈ సినిమాలో అన్‌ బిలీవబుల్‌ స్టంట్స్‌ చేస్తూ కనిపించనున్నాడు. ఆయనతో పాటు నటి సంయుక్త కూడా కొన్ని స్టంట్స్‌ చేయనుంది. అందుకోసం గుర్రపు స్వారీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రారంభించింది. ‘నా తదుపరి చిత్రం స్వయంభూ కోసం నేను గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నాను. ఇది అద్భుతమైన ప్రయాణం. మేమంతా ఒక టీమ్‌గా కలిసి పనిచేస్తున్నాం’ అని తెలిపింది సంయుక్త. భరత్‌ కష్ణమాచారి దర్శకత్వంలో ఠాగూర్‌ మధు సమర్పణలో పిక్సెల్‌ స్టూడియోస్‌పై భువన్‌ , శ్రీకర్‌ ఈ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. స్వయంభూ అత్యుత్తమ సాంకేతిక, ప్రొడక్షన్‌ వాల్యూస్‌ తో రూపొందుతోంది. . ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో షూటింగ్‌ జరుపుకుంటోంది. నిఖిల్‌తో పాటు ఇతర తారాగణం షూటింగ్‌లో పాల్గొంటున్నారు. రచన, దర్శకత్వం: భరత్‌ కష్ణమాచారి, నిర్మాతలు: భువన్‌ మరియు శ్రీకర్‌, సంగీతం: రవి బస్రూర్‌, డిఓపి : మనోజ్‌ పరమహంస, డైలాగ్స్‌: వాసుదేవ్‌ మునెప్పగారి, ప్రొడక్షన్‌ డిజైనర్‌: ఎం.ప్రభాహరన్‌, సహ నిర్మాతలు: విజరు కామిశెట్టి, జిటి ఆనంద్‌.

Spread the love