ఏపీ, తెలంగాణ భవన్‌లో హెల్ప్ లైన్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
భారీ వర్షాల కారణంగా హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరా ఖండ్‌తో పాటు ఇతర ప్రభావిత రాష్ట్రాలలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ వాసులకు సహకారం అందించటానికి ఏపీ ప్రభుత్వం హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. బాధితులు ఓఎస్‌డి పి.రవి శంకర్ (ఫోన్ నెంబర్ 9871999055), జూనియర్ అసెస్టింట్ కె. సునీల్ కుమార్ (ఫోన్ నెంబర్ 8800924911)లను సంప్రదించాలని కోరింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. బాధితులు జి.రక్షిత్ ( ఫోన్ నెంబర్ 9643723157), వందన (9871999044)ను సంప్రదించాలని కోరింది.