కాంగ్రేస్ పార్టీ గెలుపుకు పార్టీ ప్రెసిడెంట్ లు ప్రజల మధ్యలో ఉండాలి

నవతెలంగాణ – జుక్కల్

కాంగ్రేస్ పార్లమెంట్ అబ్యర్థికి భారీ మేజార్టీ ఇవ్వాలని జుక్కల్ ఎమ్మెలే తోట లక్ష్మీకాంతారావ్ అన్నారు. జుక్కల్ క్యాంప్ కార్యాలయంలో నియేాజక వర్గం లోని నిజాంసాగర్, పిట్లం, పెద్ద కొడప్ గల్, బిచ్కుంద , జుక్కల్ , మద్నూర్, డొంగ్లీ మండలాలకు నూతనంగా కాంగ్రేస్ మండలపార్టీ అద్యక్షులుగా పదవి  బాద్యతలు చేపట్టిన అద్యక్షులతో ప్రత్యేక సమీక్షా సమావేశం  ఎమ్మెలే నిర్వహించారు. ఈ సంధర్భంగా ముందుగా జుక్కల్ నియేాజకవర్గం లోని కాంగ్రేస్  మండల పార్టీ అద్యక్షులకు ఎమ్మెలే  కాంతారావు శాలువాతో సన్మానించి మిఠాయిలు తినిపించారు. అనంతరం జర్గబోయే పార్లమెంట్ ఎన్నికల దృశ్య కాంగ్రేస్ పార్టీ జహిరాబాద్ పార్లమెంట్ స్థానం  ఎంపి అభ్యర్థి సురేష్ శెట్కార్ గెలుపుకు అందరం కలిసి  కృషి చేయాలని అన్నారు, ఎప్పుడు ప్రజల మద్యలో ఉంటు వారి సమస్యలను గుర్తించి క్షేత్రస్థాయులోకి వెళ్లి  వాటిని పరిష్కారం చేయాలని పేర్కోన్నారు, మీతో పరిష్కారం కానీ యెడల నాకు డైరెక్ట్ గా అప్రోచ్ కావాలని తెలిపారు. గ్రామాలలో తిరుగుతు కాంగ్రేస్ పార్టీ  రాష్ట్రప్రభూత్వం అమలు  చేస్తున్న ఆరు గ్యారంటి పథకాలను ఓటర్లకు వివరించాలని తెలిపారు.కాంగ్రేస్ కార్యకర్తలను గుర్తించి వారితో కలిసి వారి సహకారంతో ఎన్నికలకు వెల్దామని, ఎంపి అబ్యర్థీకి నియేాజక వర్గం నుండి భారీ మేజార్టీ ఇవ్వాలని సూచించారు, అందరి సహయ సహకారాలతో గెలుపుకు కృషి చేయాలని పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ నియేాజక వర్గంలోని మండల పార్టీ అద్యక్షుడు  సంజీవ్ పటేల్, బిచ్కుంద గంగధర్, నిజాం సాగర్ మల్లికార్జున్ , మద్నూర్ సాయులు  తో పాటు పెద్ద కొడప్ గల్, డొంగ్లీ, పిట్లం మండలాల అద్యక్షులు తదితరులు పాల్గోన్నారు.
Spread the love