– శ్రావణంలో శుభముహూర్తాలు
– కిటకిటలాడుతున్న దుకాణాలు
– ఫంక్షన్ హాళ్ల ముందస్తు బుకింగ్
– ఈవెంట్ మేనేజర్లు, ఫోటోగ్రాఫర్లు, బ్యూటీషియన్లకు గిరాకీ
నవతెలంగాణ – బొమ్మలరామారం
మూడు నెలల మూఢం తర్వాత శ్రావణమాసం ప్రారంభమైంది. ఐదారురోజుల నుంచి శుభ ముహూర్తాలు మొదలయ్యాయి. పెళ్లిళ్లు, నూతన గృహ ప్రవేశాలు, ఇతర శుభకార్యాలకు మంచిరోజులు వచ్చాయి. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే ఫంక్షన్ హాల్లో, ఫోటో, వీడియో గ్రాఫర్లు, ఈవెంట్ మేనేజర్లు, బ్యాండు మేళాలు, పూలు తదితర వాటికి గిరాకీ పెరిగింది. బంగారం, బట్టల షాపుల్లో వధూవరులు కుటుంబ సభ్యులు కొనుగోలు బిజీగా ఉంటున్నారు. దీంతో ఆ దుకాణాలు కిటకిటలాడుతున్నాయి.

ముందుగానే ఫంక్షన్ హాల్ బుకింగ్
పెళ్లి తేదీ ఖరారైన రోజునే ఫంక్షన్ హాల్ లో బుకింగ్ చేసుకున్నారు. వీటి అద్దె రూ. 40 నుంచి మొదలైన రూ. 3 లక్షల వరకు ఉన్నాయి. దాదాపు ఉమ్మడి జిల్లాలో ఫంక్షన్ హాల్లో ఇప్పటికె నెలరోజుల వరకు బుకింగ్ పూర్తయినట్టు యజమానులు పేర్కొంటున్నారు.
సినిమా షూటింగ్ లో తలపించేలా…
సినిమా షూటింగ్ లో తలపించేలా… పెళ్లి వేడుకలను ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.ముందుగానే ఫ్రీ వెడ్డింగ్ గా ఘాట్ చేస్తున్నారు. దీంతో ఫోటో, వీడియో గ్రాఫర్లకు గిరాకీ పెరగడం.ఈవెంట్ మేనేజర్ల ప్రోగ్రాం ఆర్గనైజర్లు పెళ్లి పనులు నిర్వహణలో బిజీబిజీగా ఉన్నారు.అదే విధంగా వేడుకల్లో వధూవరులు అందంగా కనిపించడానికి బ్యూటీషియన్లను సంప్రదిస్తున్నారు.ప్యాకేజ్ కింద రూ. 50 వేలు నుంచి రూ.లక్ష వరకు చెల్లిస్తున్నారు.ఇలా మంగళ వాయిద్యాలు, ట్రావెల్స్ వాహనాలు, పూలఅలంకరణ, టెంట్ సామాగ్రి, వంటల నిర్వాహకులు ఆర్కెస్ట్రా, పురోహితులు, ఇవేట్ మేనేజర్లకు, పెళ్లిళ్ల సీజనో గిరాకీ లభిస్తోంది.
పూలు తప్పనిసరి…
ఏదైనా శుభకార్యాలకు పూలు తప్పనిసరి, మల్లె, బంతి, చామంతి, గులాబీ తదితర పూలకు డిమాండ్ ఉంది. వివిధ రకాల దండలు, మాలలు, డిజైన్స్ డెకరేషన్, ఈవెంట్ మేనేజర్లు, ఆర్గనైజర్లు పూలు వినియోస్తుంటారు. అలాగే, వధూవరుల కుటుంబ సభ్యులతో ఉమ్మడి జిల్లాలో షాపింగ్ మాల్స్ కలకలలాడుతున్నాయి.
శుభ ముహూర్తాల తేదీలు..

ఈ నెల 5,7,11,14,18,21,22,23,24,25,28,29,30 తేదీల్లో వివాహాలకు శుభముహూర్తాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో నెల రోజుల్లో దాదాపు 25 వేల నూతన జంటలు పెళ్లి బంధంతో ఏకం కానున్నారని మర్యాల గ్రామానికి చెందిన పురోహితుడు పెద్ది శశిధర్ శర్మ తెలిపాడు.