– బాధిత మహిళ రైతు రాజమ్మ ఆరోపణ
– అండగా దళిత సంఘాలు
నవ తెలంగాణ మల్హర్ రావు.
మండలంలోని తాడిచెర్ల గ్రామపంచాయతీ పరిధిలోని శాత్రాజుపల్లి రెవెన్యూ గ్రామ శివారులోని సర్వే నెంబర్ 26 రెవెన్యూ లవాని పట్టా ప్రభుత్వ భూమిలో పెద్దతూoడ్ల గ్రామానికి చెందిన దళిత మహిళ రైతు మంత్రి రాజమ్మకు చెందిన మూడు ఎకరాల భూమిలో ఫారెస్ట్ అధికారులు హరితహారంలో మొక్కలు నాటే ప్రయత్నం చేస్తూ భయాందోళనకు గురిచేస్తున్నారని బాధిత మహిళ రైతు మంత్రి రాజమ్మతోపాటు కుటుంబ సభ్యులు ఆరోపించారు.రాజమ్మ కుటుంబానికి దళిత సంఘాలు అండగా నిలిచాయి.ఈ సందర్భంగా శనివారం శాత్రజ్ పల్లి భూమి మొఖపై విలేకరుల సమావేశంలో మాట్లాడారు.తమ పట్టా భూమిలోకి అటవీశాఖ అధికారులు వచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.అలాగే అటవీశాఖ అధికారులు తమ కుటుంబాన్ని భయాబ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేయడం సరికాదన్నారు.2004లో అసైన్డ్ పట్టా ప్రభుత్వం జారీ చేసిందని,2019లో డిజిటల్ పట్టా ఇచ్చిందని,భూమికి రైతుబంధు సైతం వస్తోందన్నారు.గత యాభై ఏళ్లుగా మోకపై భూమిని దున్నుకొని బ్రతుకుతున్న నేపథ్యంలో అటవీశాఖ అధికారులు భూమిని అక్రమించే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ టిఎస్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ, ఎస్సి,ఎస్టీ అట్రాసిటీ విజలెన్స్ ,మానిటరింగ్ కమిటి సభ్యులు బోడ రాజు,ఎమ్మార్పీఎస్ టిఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రేణుకుంట్ల మహేష్ మాదిగ, జిల్లా అంబేద్కర్ యువజన సంఘం ఉపాధ్యక్షులు ఆతుకూరి బాల రాజు,ఎమ్మార్పీఎస్ టిఎస్ నియోజకవర్గ ఇంచార్జి శీలపాక హరీష్ మాదిగ,, మంత్రి మధు,కాటారం మండల అధ్యక్షులు అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు,ఎమ్మార్పీఎస్ కాటారం మండల సీనియర్ నాయకులు చిట్యాల సమ్మయ్య,, చిలుక నరేష్ పాల్గొన్నారు.