మొక్కజొన్న చేనును నాశనం చేసిన ఫారెస్ట్ అధికారులు 

Forest officials who destroyed the corn plant– లబోదిబో అంటున్న ఆదివాసి మహిళా రైతులు 
– న్యాయం చేయండి అంటూ.. వేడుకుంటున్న రైతులు
నవతెలంగాణ – తాడ్వాయి 
మండలంలోని ఏజెన్సీ గ్రామమైన లింగాల గ్రామపంచాయతీ పరిధిలో పెనక సాంబలక్ష్మి, పెనుక వెంకటమ్మ అనే ఆదివాసి మహిళా రైతుల 5 ఎకరాల మొక్కజొన్న చేను ను సోమవారం రాత్రికి రాత్రే లింగాల రేంజి ఫారెస్ట్ అధికారులు ట్రాక్టర్లతో దున్ని నాశనం చేశారని మహిళా రైతులు రోదిస్తున్నారు. దుక్కి దున్ని వేలల్లో ఖర్చు పెట్టి జొన్న విత్తనాలు కొనుక్కొచ్చి నాటి మొక్కలు యేపుగా పెరిగే సమయానికే రాత్రికి రాత్రే జొన్న చేను దున్ని నాశనం చేశారని ఆవేదన చెందారు. రైతులను వ్యవసాయ చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారని లింగాల స్థానిక మాజీ సర్పంచ్ ఊకే మౌనిక అన్నారు. మంత్రి సీతక్కకు ఫిర్యాదు చేసే లోపల జొన్న చేనుముని నష్టపరిచారని ఆవేదన చెందారు. అధికారులు స్పందించి నష్టపరిచిన మహిళా రైతులకు నష్టపరిహారం చెల్లించి అన్ని రకాల ఆదుకోవాలని స్థానిక ఆదివాసి గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ చిర్ర శ్రీనివాస్ ను వివరణ అడుగగా.. అది ఫారెస్ట్ సంబంధించిన ఎస్సీటీ ల్యాండ్, 2022- 23 సం. లోనే ట్రైంచ్  తీశామని, దానిని ఖరాబ్ చేసి అటవీ శాఖను నష్టపరిచారని అని తెలిపారు. ఫారెస్ట్ వారు తీసిన ట్రెంచ్ ను పూడిపేసి, అక్రమంగా విత్తనాలు నాటారని, వారికి ఎలాంటి హక్కు పత్రాలు గాని, పట్టాలు కానీ లేవని వారు అన్నారు. అడవిని నాశనం చేస్తే ఎంతటి వారినైనా చట్టరీత్యా శిక్షణ అవుతారని హెచ్చరించారు.
Spread the love