బొప్పాపూర్ లో నూతన కమిటీలు ఏర్పాటు

నవతెలంగాణ – దుబ్బాక రూరల్
నూతన అక్బర్ పేట భూంపల్లి మండల పరిధిలోని బొప్పపూర్ గ్రామంలో మెదక్ ఎంపీ ఆదేశానుసారం శుక్రవారం నూతన గ్రామ సోషల్ మీడియా, యువత, విద్యార్థి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం బొప్పాపూర్ గ్రామ సోషల్ మీడియా అధ్యక్షడిగా మారి నితిన్, గ్రామ యూత్ అధ్యక్షుడుగా రాగుల సంతోష్ గౌడ్, విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా, పర్స వినయ్ గార్లను ఏకగ్రీవంగా ఎన్నుకుని నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా దుబ్బాక నియోజకవర్గ యువత అధ్యక్షులు పాపని సురేష్ గౌడ్ మాట్లాడుతూ.. దుబ్బాకలో ప్రభాకరన్న చేసిన అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు ఐటీ సోదాలు చేయిస్తున్నారని ఆరోపించారు. ఎవరూ ఎన్ని కుట్రలు పన్నినా మెదక్ ఎంపీ ఓ వైట్ పేపర్ అన్ని లెక్కలు పక్కగా ఉంటాయని వారు అన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావ్ నియోజకవర్గ అభివృద్ధికి నిరోధకంగా మారుతూ అడ్డుపుల్లగా మారుతున్నారని ఆరోపించారు. కొంతమంది కండ్లు పగటిపూట దుబ్బాకలో కనిపిస్తాలేవంటూ ఎద్దేవ చేశారు. కార్యక్రమంలో దుబ్బాక సోషల్ మీడియా వారియర్ ఎర్రోళ్ల రాజు, గ్రామ బీఆర్ ఎస్ అధ్యక్షుడు, మాదవనేని కమలాకర్ రావు, బండమల్లయ్య, ఉప సర్పంచ్ రాజు, సీనియర్ నాయకులు దొడ్ల వెంకటస్వామి, దుబ్బరాజ గౌడ్, వంగ నర్సాగౌడ్, బాల్ లింగం గౌడ్, రాగుల వెంకటేష్, గౌడ్, తదితరులు పాల్గొన్నారు

Spread the love