కాంగ్రెస్ లో చేరిన బీజేపీ మాజీ నేత చలమల్ల కృష్ణారెడ్డి

నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: బీజేపీ మాజీ నేత మునుగోడు నియోజకవర్గ ఇంచార్జ్ చలమల్ల కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి దీపా దాస్ మున్ని సమక్షంలో గాంధీభవన్ లో శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. చలమల్ల కృష్ణారెడ్డి 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2022 మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో చలమల్ల కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అప్పటి పిసిసి అధ్యక్షులు ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్వాయి స్రవంతి రెడ్డికి టిక్కెట్ కేటాయించడంతో ఆమెకు వెన్ను దన్నుగా ఉండి కాంగ్రెస్ పార్టీ గెలుపు బాధ్యతలను ఆయన భుజస్కందాల పైన వేసుకొని ఆమె వెంట నడిచారు .కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి 2023 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో చేరడంతో చలమల్ల కృష్ణారెడ్డికి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో బీజేపీలో చేరి మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటినుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో చలమల్ల కృష్ణారెడ్డి బీజేపీలో ఆయన ప్రస్థానాన్ని కొనసాగించకపోవడంతో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు అనే వార్తలు వస్తున్నాయి.త్ వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో భువనగిరి నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన వర్గీయులు చెప్తున్నారు
Spread the love