కాల్వపల్లి ఏజెన్సీలో పర్యటించిన మాజీ చైర్మన్ డాక్టర్ అజ్మీర ప్రహ్లద్

– 96 మంది వరద బాధితులకు దుస్తులు, నిత్యవసర సరుకులు పంపిణీ
– మృతుని కుటుంబాన్ని పరామర్శ
– కాల్వపల్లి గ్రామాన్ని అన్ని విధాల ఆదుకుంటామని భరోసా
నవతెలంగాణ -తాడ్వాయి 
ఇటీవల విస్తారంగా కురిసిన వర్షాలకు కుంట తెగిపోయి, వాగు పొంగి పొరలి కొట్టుకొని పోయి ఇండ్లు కూలిపోయి నిస్సహాయులైన కాల్వపల్లి గ్రామాన్ని దివంగత మాజీ మంత్రి అజ్మీర చందూలాల్ తనయుడు, ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రహ్లాద్ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి సందర్శించి పరిశీలించారు. కాల్వపల్లి లో ఇటీవల మృతి చెందిన కొప్పుల కృష్ణారావు కుమారుడు, కొప్పుల దళిత్ అనే యువకుని దశదినకర్మకు హాజరై, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. వారి కుటుంబానికి అండగా ఉంటానని మనోధైర్యం కల్పించారు. అనంతరం వరద ఉధృతికి నిస్సహాయులైన 96 పేద కుటుంబాల ప్రజలకు దుస్తువులతోపాటు, నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ ములుగు ఎమ్మెల్యే టికెట్ ఆశావాహులు, ములుగు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ డాక్టర్ ప్రహ్లాద్ మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించారని, ఇది ప్రజల ప్రభుత్వం అని తప్పకుండా వరద బాధితులు అందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. కాల్వపల్లి సమస్యను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో నార్లాపూర్ ఎంపిటిసి కుక్కల శ్రీను, మాజీ మండల అధ్యక్షుడు బండారు చంద్రయ్య, నాయకులు పత్తి గోపాల్ రెడ్డి, ఆలేటి జైపాల్ రెడ్డి, ఇంద్రారెడ్డి,ఎనిగంటి భద్రయ్య, పీరీల చలమయ్య, పీరీల నరేష్, చంగల్వ సుభాష్, కల్వచర్ల సంపత్, గండ్రకోట సుధీర్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love