ఘనంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు

నవతెలంగాణ – గోవిందరావుపేట
మండలంలోని చల్వాయి గ్రామంలో శనివారం బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు నామ్ పూర్ణచందర్ అధ్యక్షతన  మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 70వ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. గ్రామ కమిటీ కార్యకర్తలు కేక్ కట్ చేసి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఆడంబరంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ కమిటీ అధ్యక్షుడు పూర్ణచందర్ బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వీసం సమ్మయ్య, మండల ప్రధాన కార్యదర్శి నరసింహ నాయక్ మండల అధికార ప్రతినిధి మధుసూదన్ రెడ్డి రైతు కోఆర్డినేటర్ బొల్లం ప్రసాద్ మండల ఉపాధ్యక్షులు చుక్క గట్టయ్య మండల నాయకులు సత్తు భద్రయ్య అజ్మీర సురేష్ రేండ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love