నవతెలంగాణ – అమరావతి: టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్ట్ అయి, గుంటూరు జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను వైసీపీ అధ్యక్షుడు జగన్ పరామర్శించారు. ఈ మధ్యాహ్నం గుంటూరు వచ్చిన జగన్ నందిగం సురేశ్ తో ‘ములాఖత్’ ద్వారా మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని నందిగం సురేశ్ కు సూచించారు. పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం జైలు వెలుపల జగన్ మీడియా సమావేశం నిర్వహించారు. చంద్రబాబు తప్పుల నుంచి దృష్టి మరల్చేందుకే నాలుగేళ్ల నాటి కేసును తిరగదోడారని ఆరోపించారు. అక్రమ కేసు బనాయించి ఒక దళిత నేతను అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత దుర్మార్గపు పాలన ఎక్కడా లేదని అన్నారు. నాడు దాడి ఘటనలో నందిగం సురేశ్ పాల్గొని ఉంటే సీసీటీవీ ఫుటేజిలో కనిపించాలి కదా… అని వ్యాఖ్యానించారు.