ఘనంగా మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు 

నవతెలంగాణ-నిజాంసాగర్
గత పది ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని మాజీ ఎంపీపీ జ్యోతి దుర్గారెడ్డి అన్నారు. బీఆర్ఎస్  వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిజాంసాగర్ బీఅర్ఎస్ పార్టీ  కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో శ్రేణులతో కలిసి దుర్గారెడ్డి కేక్ కట్ చేసి మాజీ సీఎం కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దుర్గారెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టిన మహానేత కేసీఆర్ అని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎమ్మెల్యే నుంచి కేంద్ర, రాష్ట్ర మంత్రులు, తెలంగాణకు రెండుసార్లు సీఎంగా పని చేశారని తెలిపారు. టిఆర్ఎస్ ను స్థాపించి బంగారు తెలంగాణ దిశగా అడుగు వేశారన్నారు. కార్యక్రమంలో అచ్చంపేట సొసైటీ చైర్మన్ నరసింహారెడ్డి, మల్లు సొసైటీ చైర్మన్ కళ్యాణి విఠల్ రెడ్డి పార్టీ శ్రేణులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love