నవతెలంగాణ – హైదరాబాద్: చెరువును ఆక్రమించి N- కన్వెన్షన్ నిర్మించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరో నాగార్జునను బిగ్‌బాస్ హోస్ట్‌గా తప్పించాలని ప్రముఖ హేతువాది బాబు గోగినేని డిమాండ్ చేశారు. ‘అక్రమ కట్టడాలపై ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ షో హోస్ట్‌ను బిగ్‌బాస్ నిర్వాహకులు తక్షణమే మార్చాలి. లేదంటే హౌస్ మేట్స్, టీవీ వీక్షకులు ఓట్లు వేసి మరీ ఆయన్ను ఎలిమినేట్ చేయాలి’ అని FBలో పోస్ట్ చేశారు. బాబు గతంలో బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.