మహారాష్ట్ర మాజీ సీఎం మనోహర్‌ జోషి కన్నుమూత

Manohar Joshiనవతెలంగాణ-ముంబయి: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌ జోషి (86) కన్నుమూశారు. రెండు రోజుల క్రితం గుండెపోటుతో ముంబయిలోని పి.డి.హందుజా ఆసుపత్రిలో చేరిన ఆయన శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈరోజు మధ్యాహ్నం ముంబయిలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు గురువారం సాయంత్రమే ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. గత ఏడాది మేలోనూ మెదడులో రక్తస్రావం కారణంగా హాస్పిటల్‌లో చేరారు.

Spread the love