మాజీమంత్రి సోదరుడికి 15 రోజుల రిమాండ్‌

మాజీమంత్రి సోదరుడికి 15 రోజుల రిమాండ్‌నవతెలంగాణ- అచ్చంపేట
మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ భూమికి తప్పుడు కాగితాలు సృష్టించి ప్లాట్లుగా విక్రయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సోదరుడు శ్రీకాంత్‌గౌడ్‌కు కోర్టు రిమాండ్‌ విధించింది. పోలీసులు ఆయన్ని శనివారం అచ్చంపేట మెజిస్ట్రేట్‌ ముందు హాజరు పరిచారు. మెజిస్ట్రేట్‌ 15 రోజుల రిమాండ్‌ విధించారు. దాంతో మహబూబ్‌నగర్‌ జైలుకు తరలించారు.

Spread the love