నవతెలంగాణ – హైదరాబాద్: బీఆర్‌ఎస్ పార్టీ కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇవాళ ఉదయం కేబీఆర్ పార్కు వద్ద మార్నింగ్ వాక్ చేస్తుండగా అయనను అరెస్ట్ చేశారు. పోలీసులు ఆయన కాల్ డేటాను కూడా పరిశీలిస్తున్నారు. నరేందర్ రెడ్డితో లగచర్ల సంఘటనకు సంబంధించి ఎవరైనా మాట్లాడారా? మాట్లాడిన వారు ఎవరు? అన్న కోణం నుంచి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లగచర్ల సంఘటన వెనుక ఉంది బీఆర్‌ఎస్ పార్టీ కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అంటూ ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.