నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
కేసీఆర్ పిలుపు మేరకు “తెలంగాణ దశాబ్ది ఉత్సవాల“ముగింపు సంధర్బంగా భువనగిరి మాజీ శాసన సభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద పుష్ప గుచ్చలు సమర్పించి కొవ్వు త్తులతో అమరులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్ప డడానికి ఎందరో మహనీయులు తమ ఆత్మ బలిదానాలు ఇచ్చారని ముఖ్యంగా,విద్యార్థులు బలిదానాల వల్లే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిందని అన్నారు. కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర సాధనకై కెసిఆర్ ఎంతో కృషి చేసారని అన్నారు. కేసీఆర్ తెచ్చి పెట్టిన రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ,రాజ్యాధికారం పొంది ప్రజలకు అమరులకు ఎటువంటి న్యాయం చేయడం లేదని వాపోయారు ఈ కార్యక్రమం లో పట్టణ అధ్యక్షులు,నాగారం కిరణ్ కుమార్,నాయకులు తాడేం రాజశేఖర్,యువజన నాయకులు నాగారం సూరజ్ సైదులు పాల్గొన్నారు.