నవతెలంగాణ – హైదరాబాద్: మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ జర్నలిస్ట్ ఆర్ సత్యనారాయణ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం సంగారెడ్డిలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడిగా, టీజీపీఎస్సీ సభ్యుడిగా పనిచేశారు. 2007లో కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలుపొందారు. 2008లో తెలంగాణ ఉద్యమంలో భాగంగా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. టీఎస్‌పీస్సీ సభ్యుడిగా పని చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.