భువనగిరి పట్టణంలో జరుగుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలో జాక్టో చైర్మన్ జి సదానందం శాడ్ , పూర్వ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పూల రవీందర్ తమ సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంట్రాక్టు పద్దతిలో నియమితులైన సమగ్ర శిక్ష బోధన బోధనేతర ఉద్యోగులు గత 15 సం॥లుగా చాలీ చాలని వేతనాలతో పనిచేస్తున్నారని, ఇతర రాష్ట్రాలలో పనిచేస్తున్న సమగ, ఉద్యోగులను క్రమబద్దీకరణ చేసినా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం గ్యులరైజ్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీరిని వెంటనే (క్రమబద్దీకరణచేయాలని రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నిరాహార దీక్షలో పాల్గొన్న ఎస్ టి యు రాష్ట్ర అధ్యక్షులు జాక్టో చైర్మన్ సదానందం గౌడ్ మాట్లాడుతూ ఎస్ ఎస్ ఏ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ను పరిశీలించి, వీరిని మబద్దీకరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ టి యు యాదాద్రి భువనగిరి జిల్లా శాఖ అధ్యక్షులు కల్లూరి రమేశ్ తదితరులు పాల్గొని మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి అధ్యష్టత వహిస్తున్న ఎం పాండు, తిరుపతి లకు సంఘీభావాన్ని ప్రకటించారు.