నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం (72) అనారోగ్యంతో కన్నుమూశారు. డయాబెటిస్, హైపర్‌టెన్షన్, క్రానిక్ కిడ్నీ డిసీజ్ తదితర మల్టీపుల్ వ్యాథులతో బాదపడుతున్న ఆయన గత నెల 22న నిమ్స్‌లో చేరారు. మొదట్లో ఆయన శరీరం వైద్యానికి సహకరించినా ఆ తర్వాత వెంటిలేషన్‌పై ఆయనకు వైద్యులు చికిత్స అందించారు. క్రమంగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆదివారం రాత్రి 7.40 గంటలకు మరణించినట్టు నిమ్స్ వైద్యులు ధృవీకరించారు. 1996,1999,2004లో టీడీపీ నుంచి 2009లో కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు. 2014లో బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన ప్రస్తుతం రాజీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, భట్టి, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజరు, పీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, నాయకులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి తదితరులు సంతాపం ప్రకటించారు.