మాజీ ఎంపీపీ మృతి

నవతెలంగాణ-కుల్కచర్ల
మండల కేంద్రం దాస్య నాయక్‌ తండాకు చెందిన మాజీ ఎంపీపీ మంగ్యా నాయక్‌ శనివారం మృతి చెందాడు. స్థానిక నాయకులు ఆయన మృదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ… మండలాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లి అభివృద్ధి చేశారని ఆయన మృతి మండల ప్రజలకు తీరని లోటు అని అన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, తండా ప్రజలు పాల్గొన్నారు.

Spread the love