భువనగిరి మండలంలోని బస్వాపురం గ్రామంలో ఐకెపి కొనుగోలు కేంద్రాన్ని భువనగిరి మాజీ ఎంపీపీ నరాల నిర్మల వెంకటస్వామి యాదవ్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. వర్షాలు కురుస్తున్నందున సరైన జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు, ఐకెపి సిబ్బంది పాల్గొన్నారు.