శ్రీ ఓం దేవి ఆలయాన్ని దర్శించిన బీజేపీ మాజీ జాతీయ కార్యదర్శి

నవ తెలంగాణ – నవీపేట్: భారతీయ జనతా పార్టీ మాజీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు ఆదివారం నవీపేట్ మండలంలోని యంచలో గల శ్రీ ఓం దేవి ఆలయాన్ని సందర్శించారు. గోదావరి హారతి యాత్రలో భాగంగా బీజేపీ మరియు ఆర్ఎస్ఎస్ నాయకులతో కలిసి ఆలయంలోని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అమ్మ వారితో కలిసి భోజన ప్రసాదాన్ని స్వీకరించారు. గోదావరి నది తీరంలో సుందరమైన ఆలయాన్ని నిర్మించి భక్తులకు విశేష సేవలు అందిస్తున్న అమ్మవారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఇందూర్ హరీష్, సర్పంచ్ ప్రవీణ్ కుమార్ లు పాల్గొన్నారు.

Spread the love