నవతెలంగాణ – ఢిల్లీ: జనతాదళ్ (సెక్యులర్) పార్టీ అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆదివారం అక్కడి మెట్రోలో ప్రయాణించారు. మాజీ ప్రధాని తమతో ప్రయాణించడంతో ప్రయాణికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దేవెగౌడ అధికారులతో ముచ్చటిస్తూ మెట్రో సేవల గురించి తెలుసుకున్నారు. కాగా ఢిల్లీలో ప్రధాని మోడీ ఏర్పాటు చేసిన ప్రధాన మంత్రుల మ్యూజియాన్ని దేవెగౌడ శనివారం సందర్శించారు. దానికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పంచుకున్నారు