టీడీపీ మాజీ ఎమ్మెల్యే కృష్ణబాబు కన్నుమూత..

నవతెలంగాణ – అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణారావు(కృష్ణబాబు) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాద్ లో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మరణించారు. ఈయన 1983, 85, 89, 94, 2004లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్టీఆర్, చంద్రబాబుతో ఈయనకు మంచి అనుబంధం ఉంది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కొన్నేళ్ల కిందట వైసీపీలో చేరిన విషయం విదితమే. కృష్ణబాబు మృతదేహాన్ని కుటుంబ సభ్యులు స్వగ్రామం దొమ్మేరుకు తరలించారు. బుధవారం నాడు అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది.

Spread the love