నవతెలంగాణ – హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి నట్వర్ సింగ్ (93) కన్నుమూశారు. కొద్దిరోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ఢిల్లీలోని మేదాంత ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. కాగా నట్వర్ 1931లో రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో జన్మించారు. 2004-05 మధ్య యూపీఏ హయాంలో విదేశాంగ మంత్రిగా సేవలందించారు. ఆయన పలు పుస్తకాలు కూడా రచించారు. 1984లో కేంద్రం నట్వర్‌ను పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించింది.