నవ తెలంగాణ-చౌటుప్పల్ రూరల్: తెలంగాణ ఉద్యమకారుడు చౌటుప్పల్ మండల మాజీ జెడ్పిటిసి మాజీ మండల పార్టీ అధ్యక్షులు పెద్దింటి బుచ్చిరెడ్డి అల్లాపురం ధర్మోజిగూడెం సర్పంచులు కొలను శ్రీనివాస్ రెడ్డి, చిన్నం లావణ్యమల్లేష్ తెలంగాణ భవన్లో శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మునుగోడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో చేరారు. గత మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి బీజేపీలోకి వెళ్లిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు బీజేపీలోకి వెళ్లారు. బీజేపీ నుండి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రాజగోపాల్ రెడ్డి వెళ్లడంతో రాజగోపాల్ రెడ్డి విధానాలు నచ్చక బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు.ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గిర్కటి నిరంజన్ గౌడ్, ఆరెగూడెం సర్పంచ్ మునగాల ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.