సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన..

– పీఆర్ ఏఈ తీరుపై ప్రజాప్రతినిధుల అసహనం 
నవతెలంగాణ – బెజ్జంకి 
మండల పరిధిలోని నర్సింహుల పల్లి గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ప్రత్యేకాధికారిణి నాగారాణీ,ఎంపీటీసీ కొలిపాక రాజు,మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి మంగళవారం శంకుస్థాపన చేశారు.ప్రభుత్వ అభివృద్ధి పనులకు పీఆర్ ఏఈ ప్రోటో కాల్ పాటించకుండా ప్రజాప్రతినిధులను అగౌరపరిచేల ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరుపై ఎంపీటీసీ కొలిపాక రాజు అసహనం వ్యక్తం చేశారు.రాజ్యాంగ బద్దంగా ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన అధికారులు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే అ ప్రభుత్వానికి వత్తాసు పలకడం సమంజసం కాదని ప్రభుత్వాధికారుల్లో మార్పు రావాలని లేనిపక్షంలో పై అధికారులకు పిర్యాదులు చేస్తామని రాజు హెచ్చరించారు.
Spread the love