నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ పట్టుబడ్డాయి. నగరంలోని కూకట్‌పల్లిలో ఉన్న శేషాద్రినగర్‌లో స్థానిక పోలీసులతో కలిసి ఎస్‌వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 3 గ్రాములు ఎంఎంబీఏ మాదకద్రవ్యాన్ని పట్టుకున్నారు. శైలేష్ రెడ్డి, రాజశేఖర్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఘటనలో తులసీనగర్‌లో జగద్గిరిగుట్ట పోలీసులతో కలిసి ఎస్‌వోఓటీ పోలీసులు సోదాలు నిర్వహించారు. రోహిత్, తిలక్ సింగ్ అనే ఇద్దరు నిందితుల వద్ద 45 గ్రాముల గంజాయితోపాటు 3 గ్రాముల ఎంఎండీఏను స్వాధీనం చేసుకున్నారు. వారిని అరెస్టు చేసిన పోలీసులు కేసు నమోదుచేసి విచారిస్తున్నారు.