ఘోర ప్రమాదంలో నలుగురు మృతి

నవతెలంగాణ – అమరావతి
కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని ఆలమూరు మండల పరిధిలోని మడికి జాతీయ రహదారిపై వ్యాను, కారు ఢీకొన్నాయి. రంపచోడవరం నుంచి మందపల్లి వెళ్తున్న వ్యాన్‌ను కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో 9 మంది గాయపడ్డారు.

Spread the love