నవతెలంగాణ – ఆర్మూర్
మండలంలోని ఫత్తేపూర్ గ్రామంలో కుక్కల దాడిలో నలుగురికి గాయాలయ్యాయని గ్రామస్తులు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ ఫత్తేపూర్ గ్రామంలో ఇంటి ముందు ఆడుకుంటున్న పది సంవత్సరాల శ్రీజ అనే చిన్నారితోపాటు, ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మహిపాల్ ను, అదే విధంగా మరో ఇద్దరిని కుక్కలు కరిచాయని, గ్రామంలో కుక్కల సంఖ్య పెరిగిందని, వెంటనే గ్రామ సర్పంచ్, అధికారులు స్పందించి కుక్కలను అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని కోరారు.