నవతెలంగాణ – హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌లోని జశ్‌పుర్ జిల్లాలో ఓ ఏనుగు దాడిలో నలుగురు మరణించారు. ఇందులో ముగ్గురు మృతులు ఒకే కుటుంబానికి చెందినవారు. బాగ్చానగర్‌లో శనివారం ఈ దారుణం చోటుచేసుకుంది. రహదారి పక్కనున్న ఇంటి గోడను తొలుత ఏనుగు నాశనం చేసింది. ఆ ఇంట్లో నిద్రిస్తున్న కుటుంబసభ్యులపై దాడి చేసి చంపేసింది. వారి అరుపులు విని అక్కడకు చేరుకున్న పక్కింటి అశ్విన్‌పై కూడా ఏనుగు దాడి చేసి హతమార్చింది.