ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

నవతెలంగాణ – అమరావతి : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, ఆటోను ఢీకొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు వద్ద జాతీయ రహదారిపై కారు, ఆటో ఎదురెదురుగా వచ్చి ఢీ కొన్నాయి. దీంతో ఆటోలో ఉన్న నలుగురు చనిపోయారు. గాయపడ్డ క్షతగాత్రులను స్థానికులు హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుల వివరాలను సేకరిస్తున్నారు.

Spread the love