నవతెలంగాణ తిరుపతి: తిరుపతి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో నలుగురు మృతి చెందారు. చంద్రగిరి మండలం భాకరాపేట కనుమ రహదారిలో అదుపుతప్పిన కంటైనర్ లారీ.. కారు, బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికి అక్కడే ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.