నవతెలంగాణ- కర్ణాటక: రహదారి పక్కన నిలిపి ఉంచిన ఓ లారీని వేగంగా వచ్చిన కారు వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని వ్యక్తుల్లో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో మల్లపుర-గొలార్‌హట్టి రహదారికి సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం గురించిన సమాచారం అందిన వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. క్షతగాత్రులను స్థానికుల సాయంతో చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు.